*అధ్యక్ష*
*ఇక్కడ ఉన్న మీరంతా ఆ నాడు*
*పార్లమెంట్ మెట్ల మీద పడుకుని కఠోర శ్రమ చేశారు*
*ఆ పోరాటం ఎందుకోసం సార్?*
*ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వస్తే*
*మా నీళ్లు మాకు,*
*మా నియామకాలు మాకు,*
*మా వనరులు మాకు వస్తాయని*
*అనుకున్నాం సార్*
*ఆ నాడు యావత్ తెలంగాణలో ఉన్న బీసీ సమాజం మొత్తం మీకు అండగా నిలిచింది*
*రాష్ట్ర సాధన పోరాటంలో ముందుండింది*
*కానీ నేడు పరిస్థితి ఏంటి సార్?*
*మాకు మా వాటా వస్తుందా?*
*మాకు న్యాయం జరుగుతుందా?*
*2014–15లో బీసీలకు ₹4,311 కోట్లు కేటాయిస్తే*
*అందులో ₹3,220 కోట్లు ఖర్చు చేయకుండా ప్రభుత్వం మిగిలించుకుంది*
*ఇది లెక్కలతో చెప్పే నిజం అధ్యక్ష*
*అప్పుడు ఆ ప్రభుత్వం*
*ఇప్పుడు ఈ ప్రభుత్వం*
*రెండు ప్రభుత్వాలూ బీసీలను నిర్లక్ష్యం చేయడంలో ఒక్కటేనా?*
*ఏ ప్రభుత్వంలోనూ*
*బీసీలకు తగిన న్యాయం జరగడం లేదు అధ్యక్ష*
*అసలు మా జాతులు బాగుపడటం*
*ఈ వ్యవస్థకు ఇష్టం లేదా సార్?*
*మా పిల్లలు పైకి రావడం*
*ఎవరికైనా ఇబ్బందేనా అధ్యక్ష ?*
*ఇది ఆరోపణ కాదు*
*ఇది తెలంగాణ బీసీ సమాజం*
*కన్నీళ్లతో అడుగుతున్న ప్రశ్న*
*రాష్ట్రం వచ్చింది*
*కానీ బీసీలకు మాత్రం రాజ్యం రాలేదు అధ్యక్ష*
*శాసన మండలిలో*
*తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షులు*
*MLC తీన్మార్ మల్లన్న గారి ఆవేదన*
Telangana Rajyadikara Party
Telangana State
0 Comments
Please leave your comments>>