*ఎల్.బి నగర్ లో ఆంధ్రజ్యోతి పత్రికను తగలబెట్టిన తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకులు*
తెలంగాణ రాజ్యాధికార పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు గౌరవ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారి పిలుపు మేరకు హైదరాబాద్ జిల్లా ఇన్చార్జ్ మరియు రాష్ట్ర కార్యదర్శి ఆర్.భావన మరియు కోట్ల వాసుదేవ్ ఆధ్వర్యంలో ఎల్బీనగర్ లో ఆంధ్రజ్యోతి పత్రికను తగలబెట్టడం జరిగింది.
బీసీలకు 42% శాతం రిజర్వేషన్ ఇవ్వడంలో దళితులు అసంతృప్తిగా ఉన్నారు అని ఆంధ్రజ్యోతిలో తప్పుడు రాతలు రాసిన వేమూరి రాధాకృష్ణ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తు నిరసనగా ఆంధ్రజ్యోతి పత్రికను ఎల్బీనగర్ కూడలిలో తగలబెట్టడం జరిగింది.
ఈ కార్యక్రమంలో వెంకటేష్,బొంగు వెంకటేష్ గౌడ్,బీమగాని మహేష్ గౌడ్ ,అంజన్ కుమార్ యాదవ్ ,
సీతమహలక్ష్మి డేవిడ్ ,విజయ్ యాదవ్ శివవీర్ రెడ్డి,తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకులు,కార్యకర్తలు పాల్గొని ఆంద్రజ్యోతి ఎండి రాధక్రుష్ణకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తు తెలంగాణ నుండి ఆంద్రజ్యోతి చానల్ మరియు పేపర్ ని తరిమికొడతామని అలాగే చానల్ ప్రసారాలు నిలుపుదల చేస్తామని హెచ్చరించడం జరిగింది.
Telangana Rajyadikara Party
Telangana State
0 Comments
🙏
.*
Shivoham*🙏🙏🙏