*రైతులకు న్యాయం జరిగే వరకు భూముల్లోకి రావద్దు!*
— ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
మల్లమ్మకుంట రిజర్వాయర్ భూ బాధిత రైతుల తరఫున అధికారులతో మాట్లాడిన టీఆర్పీ చీఫ్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
స్పందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి..భూ పరిహారం పెంపునకు చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశం
బీసీ రాజ్యాధికార యాత్రలో భాగంగా జోగులాంబ గద్వాల జిల్లాకు చేరుకున్న ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నను వడ్డేపల్లి మండలం తనగల గ్రామానికి చెందిన మల్లమ్మకుంట రిజర్వాయర్ భూ బాధిత రైతులు కలిసి తమ సమస్యను వివరించారు.
రిజర్వాయర్ కోసం భూములు కోల్పోతున్న తమకు ప్రభుత్వం ఎకరానికి ₹16.50 లక్షలు మాత్రమే నష్టపరిహారం ఇస్తోందని, అదే భూమి ప్రైవేట్ మార్కెట్‌లో ₹30 లక్షల వరకు విలువ చేస్తోందని రైతులు తమ ఆవేదన తెలిపారు.
రైతుల సమస్యపై స్పందించిన తీన్మార్ మల్లన్న అక్కడి నుంచే జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ)తో ఫోన్‌లో మాట్లాడారు.
“రైతులకు న్యాయమైన పరిహారం అందించాలి. వారికి న్యాయం జరిగే వరకు వారి భూముల్లోకి వెళ్లొద్దు” అని అధికారులకు స్పష్టం చేశారు.
విషయం ముఖ్యమంత్రి దృష్టికి వెళ్లడంతో ఇంతకు ముందు నిర్ణయించిన ధర ఎకరాకు (16,50,000) కాకుండా ఆ నష్ట పరిహారాన్ని (enhancement) మరింత పెంచడానికి సీఎం రేవంత్ రెడ్డి గారు సానుకూలంగా స్పందించినట్లు అధికారులు తెలిపారు.
తమ పక్షాన నిలబడ్డ తీన్మార్ మల్లన్న గారికి భూబాధితులు ధన్యవాదాలు తెలిపారు.
Teenmar Mallanna
Telangana Rajyadikara Party
Telangana State

0 Comments
Please leave your comments>>