*నాగర్ కర్నూల్‌లో రజకులపై జరిగిన దాడిలో రెండు నెలల పసికందు ప్రాణాలు కోల్పోవడం పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ పెద్దపెల్లి జిల్లా రజక సంఘం*
*రెడ్డి అధికార మదానికి నిరసన వ్యక్తం చేసింది.*
*తెలంగాణలో శాంతి భద్రతలు కాపాడేందుకు హోంశాఖ ఉందా లేదా అనే ప్రశ్నను సంఘం లేవనెత్తింది.*
*ముఖ్యమంత్రి చేతిలోనే హోంశాఖ ఉండగా బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలపై జరుగుతున్న అన్యాయాలకు ప్రభుత్వం ఏ సమాధానం చెబుతుందని ప్రశ్నించింది.*
*అధికార అహంకారంతో బలహీన వర్గాలపై దాడులు జరగడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని ఆందోళన వ్యక్తం చేసింది.*
*బీసీ, ఎస్సీ, ఎస్టీ ఓట్లతోనే అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం అదే వర్గాల భద్రతను నిర్లక్ష్యం చేయడం బాధాకరమని పేర్కొంది.*
*ఇకపై ఇలాంటి ఘటనలు పునరావృతమైతే తీవ్ర ఆందోళనలు చేపడతామని హెచ్చరించింది..*
*ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని రజక సంఘాలు ఐక్యంగా స్పందించి బాధితులకు న్యాయం జరిగేలా పోరాటానికి ముందుకు రావాలని పెద్దపెల్లి జిల్లా రజక సంఘం పిలుపునిచ్చింది. ✊*
*జై బీసీ*🤝💪
*బహుజనుల ఐక్యత వర్ధిల్లాలి*
న్యాయం చేసేది పోయి అన్యాయం చేస్తున్నారు!, శివోహం*
0 Comments
Please leave your comments>>