బంజారా జాతి ఆరాధ్య దైవం, మహనీయుడు సంత్ శ్రీ సద్గురు సేవాలాల్ మహారాజ్ గారి 287వ జయంతి సందర్భంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న

బంజారా జాతి ఆరాధ్య దైవం, మహనీయుడు సంత్ శ్రీ సద్గురు సేవాలాల్ మహారాజ్ గారి 287వ జయంతి సందర్భంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న

*బంజారా జాతి ఆరాధ్య దైవం, మహనీయుడు సంత్ శ్రీ సద్గురు సేవాలాల్ మహారాజ్ గారి 287వ జయంతి సందర్భంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారు ఘనంగా నివాళులర్పించారు.*🙏💐 *ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, శతాబ్దాలు గడిచినా సంత్ శ్రీ సద్గురు సేవాలాల్ మహారాజ్ గారిని బంజారా జాతి మరవకపోవడం ఆయన చూపిన ధర్మ మార్గం, సేవా తత్వం ఎంత గొప్పదో తెలియజేస్తుందని అన్నారు.* *సమానత్వం, నైతిక విలువలు, సామాజిక ఐక్యత కోసం ఆయన చేసిన కృషి తరతరాలకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.* *రాబోయే బీసీ రాజ్యంలో సేవాలాల్ మహారాజ్ గారి ప్రాముఖ్యతకు ప్రత్యేక గౌరవ హోదా కల్పిస్తామని, ఆయన ఆశయాలను ప్రభుత్వ విధానాల్లో ప్రతిబింబింపజేస్తామని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారు స్పష్టం చేశారు.* *అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీలు వేరు కాదని మనందరం ఒకటేనని, తెలంగాణలో మున్నూరుకాపు (మేము ) బీసీలు అయితే మహారాష్ట్రలో మేము ఎస్టీలుగా ఉన్నామని, ఈ విధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలంతా సామాజికంగా ఒకటే అని,మనం బలమైన శక్తిగా నిలవాలని ఆయన స్పష్టం చేశారు.* *ఈ కార్యక్రమంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకులు, బంజారా సోదరులు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు*🙏💐💐💐 Telangana Rajyadikara Party Telangana State





 

Post a Comment

0 Comments