NRB బేరింగ్ కంపెనీ దసరా పూజల్లో పాల్గొన్న ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న....*

NRB బేరింగ్ కంపెనీ దసరా పూజల్లో పాల్గొన్న ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న....*

NRB బేరింగ్ కంపెనీ దసరా పూజల్లో పాల్గొన్న ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న....* హైదరాబాద్: ఉప్పల్‌లోని ఎన్ ఆర్ బి బేరింగ్ (NRB Bearings) కంపెనీలో దసరా పురస్కరించుకుని నిర్వహించిన దుర్గామాత పూజల్లో టీఆర్పీ చీఫ్,ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మల్లన్న మాట్లాడుతూ, కంపెనీ ప్రగతికి అహర్నిశలు శ్రమిస్తున్న కార్మికులే సంస్థకు అసలైన వెన్నెముక అని కొనియాడారు. అంతర్జాతీయ ప్రమాణాలతో నాణ్యమైన ఉత్పత్తులను అందిస్తున్న ఎన్ ఆర్ బి బేరింగ్ యాజమాన్యం, కార్మికుల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారా అందరినీ ఏకం చేయడం అభినందనీయమన్నారు. దుర్గామాత ఆశీస్సులతో కార్మికుల కుటుంబాలు సుఖసంతోషాలతో వర్ధిల్లాలని, సంస్థ భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆయన ఆకాంక్షించారు. Teenmar Mallanna Telangana State





 

Post a Comment

0 Comments