గౌరవ స్పీకర్ గారిపై బిఆర్ఎస్ ఎమ్మెల్సీ తాత మధు చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరమైన వాఖ్యలు,నేను తీవ్రంగా ఖండిస్తున్నా అధ్యక్ష...*

గౌరవ స్పీకర్ గారిపై బిఆర్ఎస్ ఎమ్మెల్సీ తాత మధు చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరమైన వాఖ్యలు,నేను తీవ్రంగా ఖండిస్తున్నా అధ్యక్ష...*

*గౌరవ స్పీకర్ గారిపై బిఆర్ఎస్ ఎమ్మెల్సీ తాత మధు చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరమైన వాఖ్యలు,నేను తీవ్రంగా ఖండిస్తున్నా అధ్యక్ష...* స్పీకర్ పీఠంపై కూర్చున్న వ్యక్తి కేవలం ఒక వ్యక్తి మాత్రమే కాదు, అది ఒక అత్యున్నతమైన రాజ్యాంగ స్థానం! కొన్ని శతాబ్దాల పాటు అవమానాలు, అసమానతలు, అణచివేతలకు గురైన వర్గాల నుంచి ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ... బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగం వల్ల, ఆయన కల్పించిన హక్కుల వల్ల ఈ రోజు మా వర్గానికి చెందిన ఒక బిడ్డ వచ్చి ఆ పీఠం మీద కూర్చున్నాడు. అలాంటి పీఠాన్ని, ఆ పీఠం మీద ఉన్న వ్యక్తిని అంత పరుష పదజాలంతో అవమానిస్తారా? ఇది కేవలం చైర్మన్ గారిని అవమానించడం కాదు...యావత్ బహుజన, దళిత, బీసీ సమాజాన్ని, అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని అవమానించడమే! బిఆర్ఎస్ పార్టీకి ఇది కొత్తేమీ కాదు....గతంలో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు అడిగిన దళిత బిడ్డలను 'కుక్కలు' అని హేళన చేసిన చరిత్ర వీరిది! తాటికొండ రాజయ్య గారిని ఎలాంటి కారణం చెప్పకుండా అర్ధరాత్రి మంత్రివర్గం నుంచి తొలగించి అవమానించలేదా? దళితుడిని మొదటి ముఖ్యమంత్రి చేస్తానని చెప్పి మోసం చేయలేదా? మా వర్గానికి చెందిన ఎమ్మెల్యే సంపత్ కుమార్ గారిని కాగితాలు విసిరేశారనే నెపంతో చట్టసభ నుంచి మెడపట్టి బయటకు నెట్టేసింది నిజం కాదా? 2025లో బీహార్ శాసన మండలిలో సునీల్ కుమార్ సింగ్ అనే ఎమ్మెల్సీ సభా గౌరవానికి భంగం కలిగిస్తే, ఆయన సభ్యత్వాన్ని తక్షణమే రద్దు చేశారు. ఈ రోజు మన సభలో కూడా పీఠాన్ని, సభను అవమానించిన వారిపై కఠిన నిర్ణయం తీసుకోవాలి! ఈ రోజు చైర్మన్ గారి పీఠానికే రక్షణ లేకపోతే, ఆ కుర్చీకే విలువ ఇవ్వకపోతే... ఇక సాధారణ సభ్యులమైన మా పరిస్థితి ఏమిటి అధ్యక్షా? 'మేము వస్తాం... మాకు నచ్చినట్లు చేస్తాం' అంటే ఈ సభ నడవదు. సభా పీఠం గౌరవాన్ని కాపాడకపోతే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయి, చట్టసభలపై ప్రజలకు నమ్మకం పోతుంది. మా బహుజన బిడ్డలు కష్టపడి పైకి వచ్చి ఇటువంటి ఉన్నత స్థానాల్లో కూర్చుంటే అగ్రవర్ణాలు ఓర్చుకోలేకపోతున్నారు. ఈ దాష్టీకాలపై వెంటనే సుదీర్ఘ చర్చ జరిపి, తప్పు చేసిన వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాను అధ్యక్షా! రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ ఘటనపై తమ వైఖరి ఏంటో చెప్పాలి,మంత్రులు సమాధానం చెప్పాలి *_శాసన మండలిలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారు* Teenmar Mallanna Telangana Rajyadikara Party Telangana State





 

Post a Comment

0 Comments