తీన్మార్ మల్లన్న రాజకీయ, సామాజిక విప్లవం - తెలంగాణ
తెలంగాణ సమకాలీన రాజకీయ యవనికపై తీన్మార్ మల్లన్న ఒక తిరుగుబాటు గళం. సంప్రదాయ రాజకీయ శైలిని, మూస ధోరణులను బద్దలుకొడుతూ ఆయన నిర్మించుకున్న ఉద్యమ మార్గం అపూర్వమైనది. సాధారణ పాత్రికేయుడిగా మొదలై, తెలంగాణ యాసకు ప్రాణం పోసి, డిజిటల్ మాధ్యమాల ద్వారా ప్రజా విప్లవాన్ని సృష్టించి, నేడు బీసీ రాజ్యాధికార ఆకాంక్షను రాష్ట్ర రాజకీయాల ప్రధాన అజెండాగా మార్చిన ప్రజా నాయకుడాయన.
తెలంగాణ యాసకు పట్టాభిషేకం
ఉమ్మడి పాలనలో అవహేళనకు గురైన తెలంగాణ పల్లె పలుకుబడులను రాజీలేని ప్రజావాణిగా మలిచారు మల్లన్న. టీవీ తెరపై మొదలైన ఆయన 'తీన్మార్' వ్యంగ్యాస్త్రాలు అధికార వర్గాల్లో ప్రకంపనలు సృష్టించాయి. అచ్చమైన పల్లెటూరి మాండలికంలో పాలకవర్గాల వైఫల్యాలను, వ్యవస్థాగత లోపాలను ఎండగడుతూ సామాన్య ప్రజలకు అత్యంత చేరువయ్యారు. కృత్రిమమైన ప్రామాణిక భాషను కాదని, మట్టి వాసనగల
యాసే అసలైన ప్రజా గళమని చాటిచెప్పారు.
డిజిటల్ విప్లవం – ప్రత్యామ్నాయ మీడియా సామ్రాజ్యం
ప్రధాన స్రవంతి మీడియా పాలకవర్గాల, కార్పొరేట్ శక్తుల గుప్పిట్లో చిక్కుకున్న తరుణంలో యూట్యూబ్ వేదికగా ఆయన తెచ్చిన విప్లవం తెలంగాణలో సమాచార వ్యాప్తి రూపురేఖలను మార్చింది. ‘క్యూ న్యూస్’ వేదికను ప్రజాక్షేత్రంలో పదునైన అస్త్రంగా మార్చి, ప్రతి ఊరి సమస్యను గల్లీ నుంచి ఢిల్లీ దాకా వినిపించారు. సాంకేతికతను సామాజిక సాధికారతకు ఆయుధంగా మలచి, స్మార్ట్‌ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరినీ ఒక రిపోర్టర్‌గా, ప్రశ్నించే పౌరుడిగా తీర్చిదిద్దారు.
ఒంటిచేత్తో ప్రతిపక్ష పాత్ర
తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షాలే మౌనం దాల్చిన క్లిష్ట సమయంలో, క్యూన్యూస్ వేదికగా బీఆర్ఎస్ ప్రభుత్వ నిరంకుశ విధానాలను ఒంటిచేత్తో నిలదీశారు. నిర్బంధాలు, జైలు శిక్షలు, అక్రమ కేసులను ఎదుర్కొంటూ ప్రజాపక్షాన నిలిచారు. పదేళ్ల కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించడంలో, ప్రజాక్షేత్రంలో అసంతృప్తిని రగిలించడంలో ఆయన పోరాటం గణనీయమైన ప్రభావాన్ని చూపింది.తదనంతర రాజకీయ పరిణామాల్లో కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీలో కీలక బాధ్యతలను నిర్వర్తిస్తూ, పార్టీ గెలుపు కోసం రేవంత్ రెడ్డితో సమానంగా ప్రచారం సాగించి అధికార మార్పిడిలో కీలక భాగస్వామి అయ్యారు.
నిజాయితీ గల గళం – రాజీలేని పోరాటం
మల్లన్నకు పదవుల కంటే సిద్ధాంతం, ప్రజా ప్రయోజనాలే ముఖ్యమని మరోసారి నిరూపితమైంది. బీసీల సమగ్ర వివరాలు వెలుగులోకి రావాల్సిన కులగణన సర్వేలో జరిగిన లోపాలను, లెక్కల తప్పులను అధికారంలో ఉన్నప్పటికీ నిర్భయంగా ప్రశ్నించారు. ఈ నిబద్ధత కారణంగా అధికార పార్టీ నుంచి సస్పెన్షన్ ఎదుర్కోవాల్సి వచ్చినా వెనకడుగు వేయలేదు.చివరకు తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ సైతం కులగణనలో లోపాలున్నాయని ప్రభుత్వానికి నివేదిక సమర్పించడంతో, మల్లన్న లేవనెత్తిన వాదన అక్షరసత్యమని తేలింది. పదవులను సైతం తృణప్రాయంగా భావించి ప్రజల పక్షాన నిజం మాట్లాడిన నిజమైన ప్రజా నాయకుడిగా ఆయన ప్రజల గుండెల్లో నిలిచారు.
జెన్-జీ, విద్యార్థులలో రాజకీయ చైతన్యం
నేటి నవతరం, ముఖ్యంగా కళాశాల విద్యార్థులు, యువత సాధారణ రాజకీయ ప్రసంగాలకు లొంగరు. మల్లన్న వాస్తవ గణాంకాలు, సూటి ప్రశ్నలతో విద్యార్థుల్లో ఆలోచనను రేకెత్తించారు. నిరుద్యోగం, ఉద్యోగ నోటిఫికేషన్లు, విద్యారంగ సమస్యలపై ఆయన సాగించిన చర్చలు యువతను మేల్కొల్పాయి. రాజకీయాలంటే కేవలం ఓటు వేయడం మాత్రమే కాదని, ప్రశ్నించడమే నిజమైన ప్రజాస్వామ్యమని జెన్-జీ తరానికి బోధించారు.
బీసీ ఉపకులాల ఏకీకరణ
మెజారిటీ జనాభా ఉన్నప్పటికీ విధాన నిర్ణాయక అధికారాలకు దూరంగా ఉంటున్న బలహీన వర్గాల స్థితిగతులను మార్చడమే తన పరమావధిగా మల్లన్న ఎంచుకున్నారు. పరస్పరం విడిపోయి ఉన్న వందలాది బీసీ ఉపకులాలను ఒకే బహుజన తాటిపైకి తెచ్చేందుకు నిరంతరం శ్రమిస్తున్నారు.సంక్షేమ పథకాల లబ్ధిదారులుగా సరిపెట్టుకోకుండా, శాసించే స్థాయికి ఎదగాలనే ఆకాంక్షను రగిలిస్తున్నారు.రాష్ట్రంలో మెజారిటీగా ఉన్న బహుజనులను విస్మరించి
ఎవరూ రాజకీయం చేయలేని రీతిలో క్షేత్రస్థాయి సమీకరణాలను మారుస్తున్నారు.
భాషతో మొదలై, డిజిటల్ మాధ్యమాల ద్వారా ప్రజా చైతన్యాన్ని రగిలించి, విపక్ష శూన్యతను పూరించి, నవతరానికి దిశానిర్దేశం చేస్తూ సాగుతున్న తీన్మార్ మల్లన్న ఉద్యమం సామాజిక విముక్తి పోరాటం. ఉపకులాలను ఏకం చేస్తూ, మెజారిటీ ప్రజల ఆకాంక్ష అయిన రాజ్యాధికార పీఠం వైపు బీసీలను నడిపించడంలో ఆయన పోరాటం తెలంగాణ చరిత్రలో ఒక సువర్ణాధ్యాయం.
డాక్టర్ పర్వతం వెంకటేశ్వర్
9177566741

.*
Shivoham*
Everyone must remember the name of God Everywhere - Bhagavannam Smaran - Live with Nature - Keep the
Alive -
belongs to all Godly Creatures*





0 Comments
Please leave your comments>>