కేసీఆర్ సామ్రాజ్యమే కూలిపోయింది...రేవంతం నీ పిట్టగోడ ఎంత? నీ అధికారం ఎంత.?* నాటి కేసీఆర్ అహంకారం మట్టికరిచింది..

కేసీఆర్ సామ్రాజ్యమే కూలిపోయింది...రేవంతం నీ పిట్టగోడ ఎంత? నీ అధికారం ఎంత.?* నాటి కేసీఆర్ అహంకారం మట్టికరిచింది..




*ఎన్నికలు వద్దు....ఆర్టీసీ విలీనమే మా ఏకైక లక్ష్యం..!* ఓట్ల రాజకీయం కాదురా బాయ్... ఇది కార్మికుల బతుకు పోరాటం.! ఎన్నికలని బెదిరిస్తే భయపడేటోడు ఎవడు లేడిక్కడ.! దమ్ముంటే రండి... కార్మికుల సత్తా ఏందో బరాబర్ చూపిస్తాం.! *కేసీఆర్ సామ్రాజ్యమే కూలిపోయింది...రేవంతం నీ పిట్టగోడ ఎంత? నీ అధికారం ఎంత.?* నాటి కేసీఆర్ అహంకారం మట్టికరిచింది... రేవంతం.. నీకు ఆ నాశన కాలం రాకుండా చూసుకో.! ఇది కేవలం ఆర్టీసీ కార్మికుల సమస్య కాదు... నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ పోరాటం.! *ఆర్టీసీ విలీనం చేయకపోతే సీఎం రేవంత్ రెడ్డి దిగిపోవాలి* *మెట్రో పేరుతో రేవంత్ ,కిషన్ రెడ్డి 1200 కోట్లు లంచం తీసుకున్నారు* *బహుజన్ వర్కర్స్ యూనియన్ మీ భరతం పడుతుంది* *సంపత్ ముదిరాజ్ కి ఏమైనా జరిగితే రాష్ట్రాన్ని అగ్నిగుండం చేస్తాం..* *- ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న* మల్కాజిగిరి: ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని వెంటనే అపాయింటెడ్ డేట్ ప్రకటించాలని డిమాండ్ తో మల్కాజిగిరిలోనీ వారి స్వగృహంలో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన బహుజన్ వర్కర్స్ యూనియన్ చైర్మన్ సంపత్ ముదిరాజ్ ను కలిసి దీక్షకు సంఘీభావం తెలిపిన తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మరియు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాధం రజని కుమార్ యాదవ్... ఈ సందర్భంగా తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ... ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆర్టీసీ అనుబంధ యూనియన్ అయిన బహుజన్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జరుగుతున్న పోరాటానికి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు.కార్మికుల సమస్యలను పరిష్కరించి సంస్థను విలీనం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. *యూనియన్ ఎన్నికలు వద్దు.. ఆర్టీసీ విలీనమే లక్ష్యం* ఆర్టీసీలో ఉన్న 35,000 మంది కార్మికులు, వారి కుటుంబాల జీవితాల్లో వెలుగులు నింపడమే బహుజన్ వర్కర్స్ యూనియన్ ఏకైక లక్ష్యంమని,ఆర్టీసీకి యూనియన్ ఎన్నికలు ఏమాత్రం అవసరం లేదని, విలీనం మాత్రమే కార్మికుల బతుకులను మార్చే శాశ్వత పరిష్కారం అని స్పష్టం చేశారు. విలీనం దస్త్రం మీద ముఖ్యమంత్రి సంతకం చేస్తే, ఏకంగా తమ యూనియన్ ను రద్దు చేసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నామని మల్లన్న ప్రకటించారు. *ఆమరణ నిరాహార దీక్షకు పూర్తి మద్దతు* ఆర్టీసీ విలీనం కోసం బహుజన్ వర్కర్స్ యూనియన్ చైర్మన్ సంపత్ ముదిరాజ్ మరియు కుమార్ తమ ఇంట్లోనే చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షకు తాము సంపూర్ణ సంఘీభావం తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. ఈ దీక్ష కేవలం ఇద్దరిది కాదని, 35 వేల మంది ఆర్టీసీ కార్మికులది మరియు సబ్బండ జాతుల దీక్ష అని ఆయన అన్నారు. దీక్ష చేస్తున్న వారికి ఏ చిన్న హాని జరిగినా దానికి రాష్ట్ర ప్రభుత్వానిదే పూర్తి బాధ్యత అని హెచ్చరించారు. *కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?* కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పిన మాట నిజం కాదా అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌లను సూటిగా ప్రశ్నించారు. ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన ఈ హామీని ఎందుకు అమలు చేయడం లేదని నిలదీశారు. ఒకపక్క డిసెంబర్ 9న విలీనం చేస్తామని పత్రికల్లో లీకులు ఇస్తూనే, మరోవైపు కార్మికులను మభ్యపెట్టడానికి యూనియన్ ఎన్నికలు ఎందుకు తెస్తున్నారని మండిపడ్డారు. తాము అడుగుతున్నది తప్పైతే, మేనిఫెస్టో తీసుకుని ఏ చౌరస్తాకైనా వస్తే చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. *మెట్రో విలీనం వెనుక కుట్రలు - ఆర్టీసీపై వివక్ష* ఎవరూ అడగకపోయినా, కనీసం ధర్నాలు చేయకపోయినా మెట్రో రైలును ప్రభుత్వంలో ఎందుకు విలీనం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. మెట్రో ప్రాజెక్టులో రూ. 12 వేల కోట్ల ప్రాజెక్టును రూ. 15 వేల కోట్లకు పెంచి, అందులో సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిలు కలిసి ఎల్ అండ్ టీ (L&T) నుండి రూ. 1200 కోట్లు లంచంగా తీసుకున్నారని అన్నారు. ఆర్టీసీని విలీనం చేస్తే లంచాలు రావు కాబట్టే ఆ సంస్థపై ప్రభుత్వానికి ఆసక్తి లేదని, జాతీయ సంపదను దోచుకోవడానికే మెట్రోపై ప్రేమ చూపిస్తున్నారని విమర్శించారు. *కేసీఆర్‌కు పట్టిన గతే రేవంత్ రెడ్డికి పడుతుంది* గతంలో కేసీఆర్ కూడా నంగనాచి వేషాలు వేస్తూ ఆర్టీసీ కార్మికులు 52 రోజులు సమ్మె చేసినా, ప్రాణాలు కోల్పోయినా పట్టించుకోలేదని, దాని ఫలితంగానే అధికారం కోల్పోయి కింద పడ్డారని గుర్తు చేశారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఆర్టీసీ కార్మికులను విస్మరిస్తే కేసీఆర్‌కు పట్టిన గతే పడుతుందని హెచ్చరించారు. ఆర్టీసీ సమస్య కేవలం కార్మికులది కాదని, నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల సమస్య అని అన్నారు. *తక్షణమే విలీనం తేదీ ప్రకటించాలి.. లేదంటే డిపోల ముట్టడి* ప్రభుత్వం వెంటనే ఆర్టీసీ విలీనానికి సంబంధించిన తేదీని (Appointed Date) ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఒకవేళ విలీనం చేయడం చేతకాకపోతే, ఆర్టీసీ ఆస్తులు, భూములను కార్మికులందరికీ పంచేసి సంస్థను మూసివేస్తున్నట్లు కాగితం మీద సంతకం చేయాలని సూచించారు. ప్రభుత్వం స్పందించకపోతే సంపత్ ఇంట్లో ప్రారంభమైన ఈ ఉద్యమాన్ని రాష్ట్రవ్యాప్తం చేస్తామని, ప్రతి డిపోను ముట్టడిస్తామని హెచ్చరించారు. *కార్మిక సంఘాలకు పిలుపు* ఆర్టీసీలోని మిగతా కార్మిక సంఘాలు కూడా వాస్తవాలు గ్రహించాలని, ఎన్నికల కోసం కాకుండా విలీనం అనే ఏకైక ఆకాంక్ష కోసం చేతులు కలిపి ముందుకు రావాలని మల్లన్న పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బహుజన్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ నాయకులు,పార్టీ శ్రేణులతో పాటు వివిధ యూనియన్ల నాయకులు మరియు ఆర్టీసీ కార్మికులు పాల్గొన్నారు.. టీఆర్పీ అధినేత ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న* Teenmar Mallanna Telangana Rajyadikara Party Telangana State





 

Post a Comment

0 Comments