*తుపాకీ తూటా కంటే పదునైన..... తెలంగాణ గాన కోకిల లలితక్క పాట..*
*జోహార్ బెల్లి లలితక్క..✊*
పెద్ద పెద్ద నాయకులే 'జై తెలంగాణ'అనడానికి వణికిపోయి దాక్కున్న రోజుల్లో...
ఒంటరి మహిళగా నడుం బిగించి ఊరూరా ఉద్యమ జెండా ఎగరేసిన విప్లవ వీరనారి బెల్లి లలితక్క...
శరీరాన్ని ముక్కలు చేస్తే పాట ఆగిపోతుందనుకున్నారు అగ్రవర్ణ కుట్రదారులు....
కానీ,ఆమె చిందించిన ప్రతి రక్తపు చుక్కా తెలంగాణ అస్తిత్వానికి నిలువెత్తు సాక్ష్యంగా నిలిచింది..ప్రజా యుద్ధనౌక లలితక్క.!
తుపాకీ తూటా కంటే పదునైన పాటతో, దొరల గడీల పునాదులు కదిల్చిన అక్షరాయుధం ఆమె..
నయీం కత్తులకు లొంగని ఆ బహుజన అగ్నిశిఖ...మన నిప్పుకనిక లలితక్క
నాయకులు నక్కిన వేళ పల్లె తల్లికి గజ్జె కట్టి, ప్రాణాలను పణంగా పెట్టి తెలంగాణ ఉద్యమాన్ని మోసిన..*బెల్లి లలితక్క...*
0 Comments
Please leave your comments>>