*తమిళనాడు రాజకీయాలు దేశానికి ఒక పెద్ద సందేశం ఇస్తున్నాయని, అక్కడ యువత సంప్రదాయ పార్టీలను ప్రశ్నిస్తూ కొత్త రాజకీయాల వైపు అడుగులు వేస్తోందని తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత తీన్మార్ మల్లన్న అన్నారు.* *ప్రభుత్వ ఏర్పాటు కోసం మూడు సార్లు రాజ్ భవన్‌లో గవర్నర్‌ను కలిసినా విజయ్ కు నిరాశే ఎదురైందని పేర్కొన్నారు.* *సంఖ్యాబలం లేకుండా ప్రజల మద్దతు మాత్రమే సరిపోదని, రాజకీయాల్లో వ్యూహం మరియు బలమైన ప్రజా ఆధారం రెండూ అవసరమని తెలిపారు.* *తమిళనాడులో ప్రస్తుతం యువత రాజకీయ చైతన్యం పెరుగుతోందని, సోషల్ మీడియా ఆధారంగా కొత్త రాజకీయ శక్తులు ఎదుగుతున్నాయని మల్లన్న గారు వ్యాఖ్యానించారు. పాత పార్టీలపై ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోందని, అదే పరిస్థితి భవిష్యత్తులో తెలంగాణ రాజకీయాల్లో కూడా కనిపించే అవకాశముందని అన్నారు.*