*తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యానికి నిజమైన అర్థం తీసుకురావడమే తెలంగాణ రాజ్యాధికార పార్టీ లక్ష్యమని పార్టీ అధినేత తీన్మార్ మల్లన్న అన్నారు.*
*“రైట్ టు రీకాల్” ద్వారా ప్రజలకు తమ ఓటుతో ఎన్నుకున్న ప్రజాప్రతినిధులను తిరిగి ప్రశ్నించే హక్కు రావాలి. అవినీతి చేయాలి అన్నా, అక్రమాలకు పాల్పడాలి అన్నా రాజకీయ నాయకులకు వెన్నులో వణుకు పుట్టే విధమైన వ్యవస్థను తెలంగాణ రాజ్యాధికార పార్టీ తీసుకువస్తుంది.*
*ప్రజలకు ఏది అవసరమో అది చేసే ప్రభుత్వం రావాలి. ప్రజల అభిప్రాయమే పాలనకు దిశానిర్దేశం కావాలి. సామాన్య ప్రజల హక్కులు, గౌరవం, న్యాయం కోసం తెలంగాణ రాజ్యాధికార పార్టీ పోరాడుతుందని TRP అధినేత ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పేర్కొన్నారు.*
Teenmar Mallanna
Telangana Rajyadikara Party
Telangana State
0 Comments
Please leave your comments>>