మాట ఇచ్చాడు...నీళ్ళు తెచ్చాడు...* *● చెంగిచెర్ల 12వ డివిజన్‌లో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం..* *● బోర్ ప్రారంభించిన టీఆర్పీ అధినేత ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న*

మాట ఇచ్చాడు...నీళ్ళు తెచ్చాడు...* *● చెంగిచెర్ల 12వ డివిజన్‌లో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం..* *● బోర్ ప్రారంభించిన టీఆర్పీ అధినేత ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న*

*మాట ఇచ్చాడు...నీళ్ళు తెచ్చాడు...* *● చెంగిచెర్ల 12వ డివిజన్‌లో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం..* *● బోర్ ప్రారంభించిన టీఆర్పీ అధినేత ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న* చెంగిచెర్ల 12వ డివిజన్ ప్రజలు చాలా కాలంగా తాగునీటి సమస్యతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటీవల ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారు చెంగిచెర్లలో పర్యటన సందర్భంగా స్థానిక ప్రజలు తమ నీటి కష్టాలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. బోర్లు లేకపోవడంతో తాగునీటికి తీవ్ర కొరత ఏర్పడి, రోజువారీ జీవనం కష్టంగా మారిందని ప్రజలు వివరించారు. మల్లన్న గారు వెంటనే స్పందించి, చెంగిచెర్ల 12వ డివిజన్ టీఆర్పీ నాయకులు మహేష్ గారికి తక్షణమే బోర్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మల్లన్న గారి ఆదేశాల మేరకు తక్షణ చర్యలు తీసుకున్న మహేష్ గారు స్వల్ప కాలంలోనే (4 రోజుల్లోనే)బోర్ ఏర్పాటు పనులను పూర్తి చేయించారు. నేడు ఆ బోర్‌ను ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారు సమక్షంలో ప్రారంభించారు. ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న తాగునీటి సమస్యకు పరిష్కారం లభించడంతో డివిజన్ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ, తమ సమస్యను వెంటనే పరిష్కరించిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అలాగే వేగంగా స్పందించి పనులు పూర్తి చేసిన టీఆర్పీ నాయకుడు మహేష్ గారిని కూడా అభినందించారు. ప్రజల కష్టాలను అర్థం చేసుకుని వెంటనే చర్యలు తీసుకోవడం తెలంగాణ రాజ్యాధికార పార్టీ ప్రత్యేకత అని స్థానికులు అభిప్రాయపడ్డారు. ఇతర పార్టీలు హామీలకే పరిమితమవుతుంటే, టీఆర్పీ మాత్రం ప్రజల సమస్యలను పరిష్కరించే దిశగా పని చేస్తోందని ప్రజలు ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీఆర్పీ నాయకులు, కార్యకర్తలు, డివిజన్ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. Teenmar Mallanna Telangana Rajyadikara Party Telangana State





 

Post a Comment

0 Comments