కోటికి ఒకరే పుడతారు పుణ్య మూర్తులు వారికొరకే వస్తారు సూర్య చంద్రులు.
మనిషి రోడ్డున పడ్డాడు -1976 పేరులో కొత్తదాన్నని చూపించే ఈ చిత్రానికి కథ రాజబాబు సమకూర్చి, తన సొంత బ్యానర్ పై నిర్మించారు. అలాగే రచయితగా పేరు పొందిన సి.V రమణ దర్శకత్వం వహించారు. శంకర్ గణేష్ గారి సంగీతం లో నాలుగు మంచి పాటలు అందించారు. "కోటికి ఒకరే పుడతారు పుణ్యమూర్తులు" పాట మాత్రమే మనకు బాగా తెలిసు. ఈ పాటలో మూడు చరణాలున్నయి. మనకు దొరికే సాంగ్ లో రెండు చరణాలు మాత్రమే ఉంటాయి. ఈ మూవీ గురించి ఈ సాంగ్స్ గురించి మీ అభిప్రాయాలు తప్పక షేర్ చెయ్యండి.
చిత్రం : మనిషి రోడ్డున పడ్డాడు (October 20, 1976)
నటీ నటులు: రాజబాబు, (జయశుభ, విజయబాబు నూతన నటులు) సత్యనారాయణ, రావు గోపాలరావు, రంగనాథ్, నిర్మల, ప్రభాకర్‌రెడ్డి, చిట్టిబాబు
సంగీతం : శంకర్ గణేష్
1. కోటికి ఒకరే పుడతారు పుణ్యమూర్తులు - ఎస్.పి. బాలు కోరస్ - రచన: గోపి
2. అయ్యో మానవుడా కళ్ళు౦డే గుడ్డివాడురా మనిష౦టే - ఎస్.పి. బాలు - రచన: గోపి
3. దూరం దూరం దూరం ఎంత దూరం ఇంకెంత దూరం - ఆనంద్, పి. సుశీల - రచన: ఆత్రేయ
4. లైఫే లాటరీ వీకైతే బ్యాటరీ బ్రతుకే తల్లక్రిందులవుతుంది - ఎస్.పి. బాలు - రచన: కొసరాజు
0 Comments
Please leave your comments>>