టోల్ గేట్ అధికారుల అన్యాయానికి అడ్డుకట్ట వేసిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న* భువనగిరి హైవే రోడ్డు పై పేదల జీవనాధారమైన టిఫిన్ సెంటర్లను టోల్ గేట్

టోల్ గేట్ అధికారుల అన్యాయానికి అడ్డుకట్ట వేసిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న* భువనగిరి హైవే రోడ్డు పై పేదల జీవనాధారమైన టిఫిన్ సెంటర్లను టోల్ గేట్

*టోల్ గేట్ అధికారుల అన్యాయానికి అడ్డుకట్ట వేసిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న* భువనగిరి హైవే రోడ్డు పై పేదల జీవనాధారమైన టిఫిన్ సెంటర్లను టోల్ గేట్ అధికారులు అక్రమంగా కూలగొట్టడాన్ని తెలంగాణ రాజ్యాధికార పార్టీ చీఫ్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తీవ్రంగా ఖండించారు. విషయం తెలుసుకున్న వెంటనే ఘటనాస్థలికి చేరుకొని అక్కడి పరిస్థితులను పరిశీలించారు. ఈ సందర్భంగా టోల్ గేట్ అధికారులను అక్కడికే పిలిపించి పేదల ఉపాధిని నాశనం చేయడం ఏమాత్రం సమంజసం కాదని మండిపడ్డారు. సంవత్సరాలుగా అక్కడ టిఫిన్ సెంటర్లు నిర్వహిస్తూ కుటుంబాలను పోషించుకుంటున్న వారి జీవనోపాధినీ ఒక్కసారిగా కూలగొట్టడం అన్యాయం అని మండిపడ్డారు టిఫిన్ సెంటర్లు నిర్వహిస్తున్న బాధితులతో మాట్లాడిన మల్లన్న వారికి భరోసా ఇచ్చారు. “పేదల కడుపు కోసే చర్యలను సహించేది లేదు. మీకు న్యాయం జరిగే వరకు నేను మీతోనే ఉంటాను” అని తెలిపారు. వెంటనే టోల్ గేట్ అధికారులతో మాట్లాడి టిఫిన్ సెంటర్లు తిరిగి నిర్వహించుకునేలా చూడాలని,వాళ్ళని ఏమనొద్దని హెచ్చరించారు.వెంటనే మళ్ళీ టిఫిన్ సెంటర్ ఏర్పాటు చూసుకోండి మీకు నేనున్నా మిమ్మల్ని ఇబ్బంది పెడితే మళ్ళీ వస్తా అని వారికి ధైర్యాన్ని నింపారు మల్లన్న.. Teenmar Mallanna Telangana Rajyadikara Party Telangana State





 

Post a Comment

0 Comments