*ఖమ్మం – వెలుగుమట్ల పోరాటానికి న్యాయం! ✊*
*ఖమ్మం జిల్లా వెలుగుమట్ల గ్రామంలో ఏ ప్రభుత్వం అయితే అక్కడ ఉన్న పేదల ఇండ్లను నిర్దాక్షిణ్యంగా కూల్చి,కుటుంబాలను రోడ్డు మీదకు నెట్టిందో అదే ప్రభుత్వాన్ని ప్రశ్నించి నేడు కలెక్టర్ కార్యాలయంలో, అదే చోట బాధితులకు పట్టాలు ఇప్పించే వరకు పోరాడి నేనే నిన్న స్వయంగా పట్టాలను అందించాను*
*ఆరోజు ఖమ్మం వెళ్లి బాధితుల పక్షాన నిలబడి, తెలంగాణ రాజ్యాధికార పార్టీ తరఫున ఒక మాట ఇచ్చాం*
*“మీ గజం భూమి కూడా ఎక్కడికి పోనివ్వను” అని.*
*నేడు ఆ మాట నిలబెట్టుకున్నాం.!*
*వెలుగుమట్లలోని 31 ఎకరాల భూధన్ భూముల వెనుక భూ బకాసురులు ఉన్నారని అప్పుడే కలెక్టర్‌కు స్పష్టంగా చెప్పాం.*
*బాధితుల భూమిని దోచుకోవడానికి ప్రయత్నించిన వారిని ఎప్పటికీ వదిలిపెట్టమని హెచ్చరించాం.*
*ఇప్పటికే కొందరికి పట్టాలు ఇవ్వించే దిశగా ముందడుగు పడింది.*
*మిగిలిన ప్రతి కుటుంబానికి కూడా పట్టాలు వచ్చే వరకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ పోరాటం ఆగదు.*
*పేదల భూమి పేదలకే రావాలి…*
*వెలుగుమట్ల ప్రజలకు న్యాయం జరిగే వరకు ఈ పోరాటం కొనసాగుతుంది.*
*—TRP అధినేత MLC తీన్మార్ మల్లన్న ✊*🔥
Telangana Rajyadikara Party
0 Comments
Please leave your comments>>