*TGSRTC BC ఎంప్లాయిస్ వెల్ ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర గౌరవాద్యక్షులుగా ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న.*
ఈ రోజు 21.02.2026 రోజున TGSRTC BC ఎంప్లాయిస్ వెల్ ఫేర్ అసోసియేషన్ 330/2016, జనరల్ సెక్రటరీ పున్న హరికిషన్ గారి ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ సభ్యులు శ్రీ తీన్మార్ మల్లన్న గారిని వారి ఆఫీస్ లో కలిసి RTC కార్మికులు అనేక సమస్యలతో సతమతమవుతున్నారని, RTC లో మెజారిటీ కార్మికులుగా దాదాపు 20 వేల మంది BC ఉద్యోగులు ఉన్నందున సమస్యల ప్రభావం BC ఉద్యోగులపై ఎక్కువగా పడుతున్నదని, BC ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వ మరియు కేంద్ర ప్రభుత్వ జీవో లు ఉన్నప్పటికి సంఘానికి Grievance Meetings ఇవ్వట్లేదని తెలుపుతూ తమ సంఘానికి రాష్ట్ర గౌరవాధ్యక్షులుగా ఉంటూ RTC కార్మికుల సమస్యల పరిష్కారానికి సహకరించవలసిందిగా కోరడమైనది.
అందుకు వారు అంగీకరిస్తూ RTC కార్మికుల సమస్యల పరిష్కారానికి అలాగే BC ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కూడ తన వంతు సహాయాన్ని అందిస్తానని హామీ ఇవ్వడం జరిగింది.
ఇదే సందర్భంగా సంఘం రాష్ట్ర అధ్యక్షులుగా సంపత్ ముదిరాజ్ రాణిగంజ్ డిపో గారిని ఎన్నుకోవడం జరిగింది.
త్వరలో RTC BC ఉద్యోగుల రాష్ట్ర, జోనల్, రీజనల్ మరియు డిపో కమిటీలను ఎన్నుకొని హైదరాబాద్ లో భారీ బహిరంగ సభను నిర్వహించడంతో పాటు VC & MD గారిని కలిసి RTC కార్మికుల మరియు BC ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పున్న హరికిషన్ గారు ప్రకటించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారిని సన్మానించిన వారిలో రాష్ట్ర కమిటీ చైర్మెన్ గుండ్ల ఆంజనేయులు గౌడ్, అద్యక్షులు సంపత్ ముదిరాజ్ లతో పాటు రాష్ట్ర నాయకులు రాములు గౌడ్, రామేశ్వరం, పాండు యాదవ్, ఆంజనేయులు, నగేష్, పాండు మొదలగు వారు పాల్గొన్నారు.
Telangana State
0 Comments
Please leave your comments>>