*3000 రూపాయలకు నీ ఓటు అమ్ముకున్నావు అనుకుంటున్నావా?*
*అది కేవలం నీ ఓటు కాదు…*
*నీ పిల్లల భవిష్యత్తు.*
*నీ ఆత్మగౌరవం.*
*నీ బిడ్డల చదువు.*
*నీ కుటుంబ ఆరోగ్యం.*
*నీ గ్రామ అభివృద్ధి.*
*మున్సిపల్ ఎన్నికల్లో డబ్బులు తీసుకున్న ప్రతి ఒక్కరూ ఒకసారి ఆలోచించండి నాలుగు సంవత్సరాల 364 రోజులు మీరు నిజాయితీగా ఉంటారు.*
*కానీ ఓటు వేసే ఆ ఒక్కరోజు అవినీతికి లొంగిపోతే ఆ ఒక్కరోజు చేసిన తప్పు మిగతా ఐదు సంవత్సరాలు మీపై భారమవుతుంది.*🙏
*డబ్బులు పంచడానికి వచ్చిన నాయకుడిని అడగాలి “మాకు డబ్బులు వద్దు… మా భవిష్యత్తు కోసం ఏం చేస్తారు?” అని.*
*ఆ ప్రశ్న అడిగితే నాయకుడు మీకు భయపడతాడు 5 సంవత్సరాలు.*
*మీ ఓటుకు కాదు…!*
*మీ వ్యక్తిత్వానికి.!*
*మీ నిజాయితీకి.!*
*కానీ మీరు డబ్బు తీసుకున్న క్షణం నుండి మీరు అతన్ని ప్రశ్నించే హక్కు కోల్పోతారు.!*
*ఎందుకంటే అతను పెట్టిన ప్రతి రూపాయి చక్రవడ్డీతో సహా ప్రజల నుంచే వసూలు చేస్తాడు.!*
*ఒక్కరోజు మీరు అవినీతికి లొంగితే ఐదు సంవత్సరాలు అతను అవినీతి చేస్తాడు.*
*అందుకే…🙏*
*ఆ ఒక్కరోజు అయినా నిజాయితీగా ఉండండి.*
*మన వర్గాల కోసం మాట్లాడే నాయకులను ఎన్నుకోండి.*
*అప్పుడు మాత్రమే ప్రభుత్వ ఆసుపత్రులు సరిగ్గా పనిచేస్తాయి.*
*ప్రభుత్వ పాఠశాలలు బలపడతాయి.*
*ప్రభుత్వ కార్యాలయాలు బాధ్యతగా పనిచేస్తాయి.*
*నీ ఓటు అమ్మకానికి కాదు…*
*నీ భవిష్యత్తు నిర్మాణానికి వెయ్యి!*
*#తెలంగాణ రాజ్యాధికార పార్టీ!*🙏🔥
Telangana Rajyadikara Party
Telangana State
0 Comments
Please leave your comments>>