*అడ్వకేట్ ప్రొటెక్షన్ బిల్లును స్వాగతిస్తూనే, లోపాలను ఎత్తిచూపిన శాసన మండలి సభ్యులు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న*
తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అడ్వకేట్ ప్రొటెక్షన్ బిల్లుపై శాసనసభలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారు స్పందించారు. ఈ బిల్లును ఒక మంచి పరిణామంగా అభివర్ణిస్తూనే, ఇందులో ఉన్న పలు అంశాలపై ఆయన తన అభ్యంతరాలను మరియు సూచనలను వ్యక్తం చేశారు.
*ప్రధానాంశాలు:*
*అందరికీ సమాన రక్షణ ఉండాలి:* భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 ప్రకారం అందరూ సమానమేనని, కేవలం అడ్వకేట్లకే కాకుండా దాడులకు గురవుతున్న **జర్నలిస్టులు, ప్రభుత్వ ఉపాధ్యాయులు, ఆర్టీసీ డ్రైవర్లు, రెవెన్యూ అధికారులు మరియు విద్యుత్ శాఖ ఉద్యోగులకు* కూడా ఇటువంటి రక్షణ కల్పించాల్సిన అవసరం ఉందని ఆయన డిమాండ్ చేశారు.
*చట్టం దుర్వినియోగం కాకూడదు:* నిజమైన బాధితులైన అడ్వకేట్లకు రక్షణ అవసరమేనని, అయితే భూకబ్జాలు, బెదిరింపులు లేదా ఇతర అక్రమాలకు పాల్పడే వారికి ఈ చట్టం ఒక రక్షణ కవచంలా లేదా ఆయుధంగా మారకూడదని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు. ఉదాహరణగా వరంగల్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి అడ్వకేట్ గా చెప్పుకుంటూ బెదిరింపులకు పాల్పడుతున్నాడని, అలాంటివారికి ఈ చట్టం రక్షణ కవచంలా మారకూడదని అన్నారు
*విచారణ ప్రక్రియలో వివక్ష వద్దు:* సామాన్య పౌరుడిపై ఫిర్యాదు రాగానే ఎఫ్ఐఆర్ (FIR) నమోదు చేయడం సులభమని, కానీ అడ్వకేట్ల విషయంలో ప్రత్యేక కమిటీలు, ఫిల్టర్లు మరియు విచారణలు ఉండటం వల్ల బాధితులకు న్యాయం జరగడంలో ఆలస్యం అవుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
*హక్కులతో పాటు బాధ్యతలు ఉండాలి:* ఈ బిల్లులో అడ్వకేట్లకు హక్కులు, సౌకర్యాలు ఎక్కువగా ఉన్నాయని, కానీ వారి బాధ్యతల గురించి ప్రస్తావన తక్కువగా ఉందని ఆయన విమర్శించారు. క్లయింట్లను వేధించడం, భారీ ఫీజులు వసూలు చేయడం, కోర్టు ప్రాంగణాల్లో హింసకు పాల్పడటం వంటి అంశాలపై కూడా చర్యలు ఉండాలని సూచించారు.
*డేటా సమర్పించాలి:*
2014 నుండి ఇప్పటివరకు అడ్వకేట్లపై జరిగిన దాడుల వివరాలను, అందులో వృత్తిపరమైన కారణాలతో జరిగినవి ఎన్నో పూర్తి వివరాలను సభకు సమర్పించి ఉంటే బాగుండేదని, తద్వారా ఇంకా ఎక్కువ చర్చ జరిపే అవకాశం ఉంటుందే అని ఆయన అభిప్రాయపడ్డారు.
*అణగారిన వర్గాల ఉద్యోగులకు రక్షణ:* బీసీ ఉద్యోగులపై జరుగుతున్న దాడులను అరికట్టడానికి వారికి కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం తరహా లోనే బీసీలకు కూడా ప్రత్యేక రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఈ బిల్లును అడ్వకేట్ల వరకే పరిమితం చేయకుండా, సమాజంలో బాధ్యతాయుతమైన వృత్తుల్లో ఉండి దాడులకు గురవుతున్న అందరికీ వర్తింపజేయాలని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారు ప్రభుత్వాన్ని కోరారు.
Teenmar Mallanna
Telangana Rajyadikara Party
Telangana State
0 Comments
Please leave your comments>>