*మేడారం సమ్మక్క,సారక్క జాతర అనగానే ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి మాత్రమే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం బడ్జెట్ కేటాయించడం జరుగుతోంది*
*ఇలా తాత్కాలికంగా కాకుండా, ఒక్కసారే శాశ్వతంగా ఉపయోగపడే విధంగా మేడారం ప్రాంతంలో బలమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మాణాలు చేపట్టాలి సార్*
*అలాగే, మేడారం చుట్టుపక్కల ఉన్న గిరిజన,ఆదివాసీ ప్రాంతాలను పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేయాలి సార్*
*దీంతో ఆ ప్రాంత ప్రజలకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి, ప్రాంత అభివృద్ధి కూడా జరుగుతుంది*
*ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, జాతర పూర్తయ్యాక మేడారం ప్రాంతంలోకి వెళ్లే పరిస్థితి ఉండడం లేదు సార్*
*అందుకే జాతర అనంతరం పరిశుభ్రత పనులను ప్రభుత్వం స్వయంగా పర్యవేక్షిస్తూ ప్రత్యేక చర్యలు తీసుకోవాలి సార్*
*పరిశుభ్రతతో పాటు హెల్త్ సమస్యలు తలెత్తకుండా వైద్య పరంగా కూడా ముందస్తు ఏర్పాట్లు చేయాలి సార్*
*అలాగే, జాతర పేరుతో రవాణా ఛార్జీలు పెంచకుండా,*
*ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత మహిళా బస్ ప్రయాణ సౌకర్యాన్ని యథాతథంగా కొనసాగించాలి సార్ అని ఈ సందర్భంగా కోరుతున్నాను*
*మండలిలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షులు MLC తీన్మార్ మల్లన్న గారు*🔥
Telangana Rajyadikara Party
Telangana State
0 Comments
Please leave your comments>>